ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు - చెన్నై - కోల్‌కతా వేదికల్లో పాక్ మ్యాచ్‌లు

బుధవారం, 12 ఏప్రియల్ 2023 (08:17 IST)
ఐసీసీ ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా ఈవెంట్ అక్టోబరు నుంచి ప్రారంభంకానుంది. ఇందులోపాల్గొనే పాకిస్థాన్ జట్టు తాను ఆడే మ్యాచ్‌లను చెన్నై, కోల్‌కతా వేదికల్లో ఆడాలని భావిస్తుంది. ఈ విషయాన్ని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై ఐసీసీ అధికారి ఒకరు స్పందిస్తూ, "బీసీసీఐ, భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చాలా ఆధారపడి ఉంది. ఒకవేళ పాకిస్థాన్‌నే ఎంచుకోమంటే.. తమ మ్యాచ్‌ల్లో చాలా వరకు కోల్‌కతా, చెన్నైలో ఆడేందుకే మొగ్గుచూపుతుంది. 
 
2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లను పాకిస్థాన్ జట్టు కోల్‌కతాలో ఆడింది. ఇక చెన్నై ఆ జట్టుకు చిరస్మరణీయ వేదిక. పాక్‌కు ఈ వేదికలు సురక్షితంగా అనిపిస్తాయి కూడా'' అని ఆయన వివరించారు. 2023 వన్డే ప్రపంచకప్‌ అక్టోబరు 5వ తేదీన ఆరంభమవుతుంది. వేదికలు 12. ఇందులో హైదరాబాద్‌ కూడా ఉంది. టోర్నమెంట్లో ప్రతి జట్టూ లీగ్‌ దశలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది.
 
మరోవైపు, ఈ యేడాది ఆసియాకప్‌లో భారత్ ఆడేందుకు తిరస్కరిస్తే తాము 30 లక్షల డాలర్లు నష్టపోతామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధిపతి నజమ్‌ సేథి వాపోతున్నాడు. ఆసియాకప్‌లో తన మ్యాచ్‌లను భారత్‌ విదేశాల్లో ఆడుతుంది. మిగతా మ్యాచ్‌లకు పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తుంది. ఇది మా ప్రతిపాదన. ఇలాకాకుండా వేరే ఏ షెడ్యూలునూ మేం అంగీకరించం. టోర్నీలో ఆడంబోం అని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు