ఆస్ట్రేలియా డబుల్ సెంచరీ.. డేవిడ్ వార్నర్.. పుష్ప మార్క్ సెలెబ్రేషన్స్

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (22:06 IST)
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాదే పైచేయిగా వుంది. ఫీల్డింగ్ అదిరిపోవడంతో ఆసీస్ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. అలాగే బ్యాటింగ్‌లోనూ ఆసీస్ అదరగొట్టింది. 
 
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. 
 
ఈ మెగా టోర్నీలో ఇద్దరు ఓపెన్లరు సెంచరీ చేయడం ఇదే తొలి సారి. ముందుగా డేవిడ్ వార్నర్ 82 బంతుల్లో సెంచరీ సాధించగా.. ఆ మరుసటి బంతికే మిచెల్ మార్ష్ బౌండరీ బాది 100 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 
 
సెంచరీ పూర్తయిన అనంతరం డేవిడ్ వార్నర్.. పుష్ప ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. "తగ్గేదేలే" అంటూ సైగలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

David Warner

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు