కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్ కావడం వల్లే ఇంగ్లండ్ గెలిచిందన్న చర్చ సరైనది కాదన్నారు. అసలు తమ గెలుపునకు ముఖ్య కారణం ఈడెన్ గార్డెన్ మైదానమేనని చెప్పారు. ఈ మైదానంతో పాటు.. పిచ్ అచ్చం ఇంగ్లండ్ మైదానం, పిచ్‌లాగే ఉందని అందుకే విజయం సాధించినట్టు చెప్పారు.
కాగా, ఈ వన్డే మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెల్సిందే. తీవ్ర ఉత్కంఠత మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఇంకా నాలుగు బంతులు ఉన్నంత వరకూ మ్యాచ్ భారత్ వైపే ఉంది. ఆ సమయంలో కేదార్ జాదవ్ అనూహ్యంగా ఔట్ కావడంతో కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు.