ఢిల్లీకి చెందిన 38 ఏళ్ల వయసున్న నెహ్రా, సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లాలో ఇటీవల న్యూజిల్యాండ్‌తో టీ-20ని ఆడి, తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే.
దీనిపై అక్తర్ ట్వీట్ చేస్తూ, తనతో పాటు ఆడిన నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్లలో నెహ్రా ఒకడని కొనియాడాడు. ఆయనతో కలసి ఆడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, నెహ్రా స్వతహాగా ఓ మంచి వ్యక్తని అన్నాడు.
తదుపరి నెహ్రా తన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. తన కెరీర్‌లో పలుమార్లు ఎత్తు పల్లాలను ఎదుర్కొన్న నెహ్రా, ఫిట్నెస్ నిరూపించుకుని తిరిగి ప్రధాన జట్టులో స్థానం పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయని అక్తర్ తన ట్వీట్‌లో గుర్తు చేశాడు.