చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టుపై ఇంగ్లండ్ సానుభూతి చూపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండానే ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత్ ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, తప్పకుండా 378 పరుగులు చేయాల్సి వుంది. కానీ, 337 పరుగులకే ఆలౌట్ అయింది. అయినప్పటికీ భారత్‌ను ఫాలోఆన్ ఆడించలేదు.
ఇప్పటికీ ఇంగ్లండ్ కంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు వెనుకబడి ఉంది. అయితే ఇంగ్లండ్ మాత్రం టీమిండియాను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకుంది. అయితే రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోవడం విశేషం. అశ్విన్ బౌలింగ్‌లో బర్న్స్ (0) డకౌటయ్యాడు.