Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

దేవీ

మంగళవారం, 10 జూన్ 2025 (17:39 IST)
At Mumbai- Kubera team
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, శేఖర్ కమ్ముల మూవీ  'కుబేర'. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ పాటని ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు.  
 
ధనుష్ మాట్లాడుతూ,  నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమా షూటింగ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నాగార్జున తో కలసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా పాజిటివ్ టీం తో కలిసి పని చేసాం. ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ ని ప్లే చేశాను. ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్‌, హోమ్‌ వర్క్‌ చేశా’ అని చెప్పను. మా డైరెక్టర్ గారిని ఫాలో అయ్యాను. 
 
శేఖర్ గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ని నేను ఇప్పటివరకు చేయలేదు. డైరెక్టర్ శేఖర్ గారు వెరీ ప్యూర్ పర్సన్. ఆయన కారణంగానే ఈ సినిమా చేశాను. ఆయన 20 నిమిషాలు ఈ కథ చెప్పారు. ఆయన ఎనర్జీ నాకు చాలా నచ్చింది. వెంటనే ఓకే చేశాను. చాలా హానెస్ట్ గా తీసిన సినిమా ఇది. ఈ సినిమా నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. ఓ డంప్‌యార్డ్‌లో దాదాపు 7 గంటలపాటు నేను, రష్మిక షూటింగ్‌లో పాల్గొన్నాం. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉంది. ‘నాకేం వాసన రావట్లేదు’ అని చెప్పింది. మరి ఆమెకు ఏమైందో నాకు తెలియదు. ఇలా ఎన్నో మంచి జ్ఞాపకాలు పంచిందీ కుబేర. జూన్ 20న ఈ సినిమాని చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.  
 
నాగార్జున మాట్లాడుతూ, శివ, క్రిమినల్..ఇలా నా కెరీర్ బిగినింగ్ నుంచి నా చిత్రాలకి ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. నా డబ్బింగ్ చిత్రాలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేశారు. కుబేర నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అనుకున్నప్పుడు శేఖర్ వచ్చారు. ఆయనతో గత 15 ఏళ్లుగా పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను.

జిమ్ సర్బ్ తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు చాలా చక్కగా మాట్లాడారు.  రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. తన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. తను ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. డబ్బింగ్ చూసిన తర్వాత తనకు ఫోన్ చేసి అభినందించాను. ఇందులో తన పెర్ఫార్మన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.  దేవిశ్రీ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ధనుష్ బ్రిలియంట్ యాక్టర్. ఈ సినిమాలో అద్భుతంగా చేశారు అన్నారు  
 
హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ, నాగార్జున సర్ , ధనుష్‌ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. శేఖర్ గారితో  వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో మా పెర్ఫార్మన్స్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.  ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. ఆడియన్స్ రియాక్షన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన. నా గత సినిమాల్లో పాత్రలు  గీతాంజలి, శ్రీవల్లి, మహారాణి యేసుబాయి లానే  ‘కుబేర’లో ప్లే చేసిన రోల్‌ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది' అన్నారు.
 
యాక్టర్ జిమ్ సర్భ్ మాట్లాడుతూ,  నాగార్జున గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. ఈ సినిమా కోసం తెలుగులోనే డైలాగ్స్ చెప్పాను. నాగ్ సర్ చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు. ఆయన సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోను. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడం అనేది చాలా చాలెంజింగ్ గా అనిపించిం.ది చాలా అద్భుతమైన సినిమా కుబేర. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు