వచ్చే యేడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్య పెంచనున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ కోసం నిర్వహించిన బిడ్డింగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా, మీడియా హక్కులు రికార్డు స్థాయి ధర పలికింది. దీంతో వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను పెంచనున్నారు.
ఈ మేరకు తాము అన్ని దేశాల క్రికెట్ బోర్డులతోనూ, ఐసీసీతోనూ చర్చించామని వెల్లడించారు. తద్వారా ఐపీఎల్ కు అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారులు అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం అయిందని జై షా తెలిపారు. అంతేకాదు, వచ్చే సీజన్ నుంచి మహిళల ఐపీఎల్ కూడా తమ ప్రాధాన్యతాంశమని తెలిపారు.