ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు.. జియో ఖాతాలో కొత్త ప్రపంచ రికార్డ్

మంగళవారం, 30 మే 2023 (19:59 IST)
CSK_Gujarat Titans
టాటా ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. వర్షం ఈ మ్యాచ్‌ను టెన్షన్‌లోకి నెట్టేశాడు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ పోరును వీక్షించేందుకు భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. వీరిలో ధోనీ కోసం వచ్చిన వారి సంఖ్య అధికం. 
 
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్‌ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు కొత్త రికార్డును బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని జియో సినిమా ప్రకటించింది. విషయం ఏంటంటే.. జియో సినిమా ద్వారా ఐపీఎల్ 2023 ఫైనల్ పోరును వీక్షించిన వారి సంఖ్య 3.2 కోట్ల మందికి చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
వర్షం కారణంగా అర్థరాత్రి పూట వరకు జరిగిన ఈ మ్యాచ్‌ను రెండు కోట్ల మంది వరకు వీక్షించారు. తద్వారా జియో సినిమా లైవ్ వీక్షకుల సంఖ్య కొత్త రికార్డును చేరింది. ముందుగా భారత్-న్యూజిలాండ్ మధ్య 2019లో ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ పోరును అత్యధిక మంది వీక్షించారు. ఆ మ్యాచ్ తర్వాత మే 23న గుజరాత్-చెన్నై మ్యాచ్‌ను 2.5 కోట్ల మంది వీక్షించారు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 ఫైనల్‌ను 3.2 కోట్ల మంది వీక్షించడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు