స్వదేశంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. శుక్రవారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులోభాగంగా భారత్ వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. రెండో వన్డే మ్యాచ్ విశాఖపట్టణంలో జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది.
తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు విశాఖలో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగనుండగా టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతుండగా రేపు విశాఖలోనూ వరుణి ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.