ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపుతోంది. ఈ టోర్నీలో భాగంగా, ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల గురించి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా, మైదానంలో ఆటను విశ్లేషించుకుని.. ముందుకు సాగే విధానం ఇద్దరిలో వేరైనా.. తమ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేస్తారని శాస్త్రి అన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ధోనీ వద్ద కోహ్లీ సలహాలు తీసుకుంటాడు. మరికొన్ని సందర్భాల్లో కోహ్లీ వద్ద ధోనీ సలహాలు తీసుకుంటాడని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో పలు కీలక మ్యాచ్‌లలో ధోనీ చాలా నెమ్మెదిగా, విసుగుపుట్టించేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, కెప్టెన్ కోహ్లీ మాత్రం ధోనీకి అండగా నిలిచాడు.