ధోనీపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. టీమిండియా గెలిచింది కాబట్టి?

శుక్రవారం, 28 జూన్ 2019 (09:15 IST)
ప్రపంచ కప్‌ క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుపై మొన్నటికి మొన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విమర్శలు గుప్పిస్తే.. నేడు హైదరాబాదీ స్టార్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ ధోనీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్‌‌‌‌తో జరిగిన మ్యా‌చ్‌లో ధోనీ నిదానంగా ఆడాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నేఫథ్యంలో ధోనీ బ్యాటింగ్‌పై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశించినంత వేగంగా ధోనీ పరుగులు చేయలేదని, అతని స్ట్రయిక్ రేట్ ఎంతో సేపు 50 దాటలేదని లక్ష్మణ్ గుర్తు చేశాడు. ఇది తనకు ఎంతో అసంతృప్తిని కలిగించిందన్నారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ధోనీ వెనక్కు తిరిగి చూసుకుంటే, ఇదే విధమైన అభిప్రాయం కలుగుతుందని, తన ఆటతీరుతో ఆయన చింతిస్తాడని అభిప్రాయపడ్డారు.
 
ఇకపోతే.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 29వ ఓవర్‌లో కేదార్ జాదవ్ అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ, వేగంగా ఆడలేదన్న సంగతి తెలిసిందే. చివరి వరకూ ఉన్న ధోనీ, ఆఖర్లో బ్యాట్‌ను ఝళిపించి 56 పరుగులు చేశాడు. అంతకుముందు చాలాసేపు సింగిల్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో ధోనీ తప్పించుకున్నాడని లేకుంటే పరిస్థితి వేరేలా వుండేదని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు