భారతీయ క్రికెటర్లలో ఏ ఒక్కరికీ సాధ్యంకాని అరుదైన ఫీట్‌ను యువ క్రికెటర్ అభిషేక్ శర్మ సాధించారు. పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఏకంగా 13 సిక్సర్లు బాది తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఒక్క భారతీయ క్రికెటర్ సాధించని అరుదైన ఫీట్‌ను అభిషేక్ శర్మ సాధించారు.
అంతకాకుండా, ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కలిపి అభిషేక్ 279 రన్స్ చేశాడు. తద్వారా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆల్‌టైన్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్ సిరీస్‌లో కోహ్లి 231 పరుగులు చేశాడు.
టీమిండియా తరపున ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
280 - తిలక్ వర్మ (4 ఇన్నింగ్స్) వర్సెస్ దక్షిణాఫ్రికా, 2024
279 - అభిషేక్ శర్మ (5 ఇన్నింగ్స్) వర్సెస్ ఇంగ్లాండ్, 2025
231 - విరాట్ కోహ్లి (5 ఇన్నింగ్స్) వర్సెస్ ఇంగ్లాండ్, 2021