బ్రియాన్ లారాకు ఏమైంది.. ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్?

బుధవారం, 26 జూన్ 2019 (10:02 IST)
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. దీంతో ఆయన అభిమానులతో పాటు.. క్రికెట్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత కొన్ని రోజులుగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో లారా తాజాగా ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
 
చిన్నపాటి అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాననీ, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి బెడ్‌పై నుంచి ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ను కూడా తిలకించినట్టు చెప్పారు. 
 
మంగళవారం రాత్రి ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి లారా హాజరయ్యాడు. ఆయనకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో ఆయన్ను వెంటనే పరేల్ ప్రాంతంలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న లారా గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్న విషయం తెల్సిందే. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ అనంతరం కామెంటరీ బాధ్యతల నుంచి కొంత విరామం తీసుకున్న లారా రేపు భారత్-విండీస్ మ్యాచ్‌కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు