జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ కూతురు జోహ్రాకు భారత క్రికెటర్ గౌతం గంభీర్ అండగా నిలబడ్డారు. అంతేకాకుండా, జోహ్రా చదువుల కోసం తాను సాయం చేస్తానని క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు కూడా. దీనికి గంభీర్‌కు ఐదేళ్ల జోహ్రా ధన్యవాదాలు తెలిపింది.
"నేను డాక్టర్‌ని కావాలని అనుకుంటున్నా. దానికి సాయం చేస్తానన్న గంభీర్ సార్‌కు థ్యాంక్స్. నేను, నా కుటుంబం ఎంతగానో ఆనందిస్తున్నాం" అని జోహ్రా అన్నది. దీనిపై గంభీర్ స్పందించాడు. 'జోహ్రా బేటా నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. నువ్వు కూడా మా ఇద్దరు కుమార్తెలు ఆజీన్, అనైజాలాంటిదానివే. డాక్టర్‌ని కావాలని అనుకుంటున్నావట. నీ కలలను సాకారం చేసుకునే దిశగా స్వేచ్ఛగా విహరించు. మేమున్నాం' అని గంభీర్ ట్వీట్ చేశాడు.