ఇక చాలు.. లంక కెప్టెన్సీకి గుడ్ బై చెబుతా : జయవర్ధనే

FILE
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ తర్వాత వన్డే, టెస్టుల సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్దనే భావిస్తున్నాడు. యువ ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగించడంతో పాటు యువ క్రికెటర్లకు అవకాశం కల్పించే రీతిలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు.

యువ ఆటగానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందనీ, వైస్ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్‌గా సరిపోతాడనీ 35 ఏళ్ల జయవర్ధనే అభిప్రాయపడ్డాడు.

ఆసీస్‌ సిరీస్‌తో కెప్టెన్‌గా ఏడాది కాంట్రాక్టు ముగుస్తుందని, సిరీస్ తర్వాత కెప్టెన్‌గా కొనసాగదలచుకోలేదని అతను తెలిపాడు. కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్, తన వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడే కొత్త కెప్టెన్‌ను నియమిస్తే జట్టుకు మేలు జరుగుతుందని స్పష్టం చేశాడు.

వెబ్దునియా పై చదవండి