దక్షిణాఫ్రికా జట్టులో స్థానం కోసం గిబ్స్ నానా తంటాలు!
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి వెలివేయబడిన గిబ్స్ తిరిగి జాతీయ జట్టులో స్థానం దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. 2011వ సంవత్సరం భారత ఉపఖండంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో జట్టులో స్థానం సంపాదించుకోవాలని గిబ్స్ ఆరాటపడుతున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఆడే దక్షిణాఫ్రికా జట్టులో స్థానం దక్కించుకుంటే.. తన కెరీర్‌లో నాలుగోసారి వరల్డ్ కప్‌లో పాల్గొన్నట్లవుతుందని గిబ్స్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో గిబ్స్‌కు స్థానం లభించే అవకాశాలు కరువైయ్యాయి. దక్షిణాఫ్రికా సెలక్టర్ ఆండ్రూ హట్సన్.. యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.