శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ ప్రధాన తారాగణంగా రిలీజ్ అయిన చిత్రం '#సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే9న విడుదలై సక్సెస్ గా సాగుతోంది. ప్రమోషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల యాత్రలు చేసింది చిత్ర యూనిట్.