TSFCC Letter - sunil narang
తెలంగాణ థియేటర్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు.. సినిమా థియేటర్లు కేవలం షేర్ ఆధారిత వ్యవస్థపైనే నడపాలని నిర్ణయించారని, అలాగే కొన్ని శాతం పద్ధతుల్లో థియేటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ చానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) స్పష్టం చేసింది.