శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికైన గ్రాహం ఫోర్డ్!
శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్‌గా గ్రాహం ఫోర్డ్ ఎంపికయ్యారు. ఈ మేరకు గ్రాహం ఫోర్డ్‌ను నియమిస్తూ శ్రీలంక క్రికెట్ కమిటీ ప్రకటించింది. కెప్టెన్సీ నుంచి తిలకరత్నే దిల్షాన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో మహేల జయవర్ధనేను నియమించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్‌లతో జరిగే ముక్కోణపు క్రికెట్ సిరీస్‌లో గ్రాహం ఫోర్డ్ బాధ్యతలను స్వీకరిస్తారు.
1999 నుంచి 2001 సంవత్సర కాలంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఫోర్డ్ కోచ్‌గా పనిచేశారు. మార్ష్ కోచింగ్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టుల్లో ఓటమిపాలై, ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది.
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న లంక జట్టును గాడిలో పెట్టేందుకు గ్రాహం ఫోర్డ్ మంచి కోచింగ్ ఇస్తాడనే నమ్మకంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆయనను కోచ్‌గా నియమించింది.