సింగర్‌గా అవతారమెత్తిన భజ్జీ: రికార్డ్ అయిన పంజాబీ సాంగ్!!
సోమవారం, 12 డిశెంబరు 2011 (16:48 IST)
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫామ్ కోల్పోవడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ, ఫామ్‌కోసం ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ మరోవైపు సింగర్‌గానూ అవతారమెత్తాడు. ఇప్పటివరకు స్పిన్ బౌలర్‌గా రాణించిన భజ్జీ... ఇక సింగర్‌గానూ మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. పంజాబీ సింగర్ లక్వీందర్‌తో కలిసి లూధియానాలని స్టూడియోలో భజ్జీ పాటను రికార్డు చేశారు. ఈ పాటను భజ్జీ తన తల్లికి అంకితం చేసినట్లు ప్రకటించాడు.
భజ్జీ పాడిన పాటకు సంజయ్ గిలోరి లిరిక్స్ అందించగా, పాట రికార్డింగ్ అద్భుతంగా జరిగిందని పంజాబీ సింగర్ లక్విందర్ లక్కీ చెప్పారు. ఈ పాట మదర్స్ డే (మే 2012) సందర్భంగా విడుదల కానుందని లక్కీ అన్నారు.
రంజీ ట్రోఫీలో ఆడేందుకు మొహలీలో ఉన్న భజ్జీని ఓ పాట పాడాల్సిందిగా తాను కోరినట్లు గియోల్రీ తెలిపారు. ఆ పాటకు భజ్జీ బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుందనే ఉద్దేశంతో హర్భజన్ సింగ్‌తో ఈ పాటను పాడించినట్లు వెల్లడించారు. ఈ సందేశంలో సామాజిక సందేశం దాగివుంటుందని, మదర్స్ డేకు ఈ పాటను విడుదల చేయనున్నామని ప్రకటించారు.