స్నేహితురాలు హీనా హిలాల్‌ను పెళ్లాడిన ఆసిఫ్!

FILE
పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు హీనా హిలాల్‌ను ఆసిఫ్ వివాహం చేసుకున్నాడు. ఎంబిఎ విద్యార్థిని అయిన హీనా హిలాల్‌తో ఆసిఫ్ వివాహం మంగళవారం వైభవంగా జరిగింది. కానీ ఆసిఫ్ వివాహ వేడుకలో వధూవరుల బంధువులు, కొంతమంది సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

ఇకపోతే.. ఆసిఫ్ సహచర క్రికెటర్లను వివాహానికి ఆహ్వానించినటప్పటికీ, దుబాయ్‌లో ట్వంటీ-20 జాతీయ ఛాంపియన్‌షిప్‌ కొనసాగుతున్న కారణంతో వారు హాజరుకాలేకపోయారని ఆసిఫ్ సోదరుడు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు నూతన కోచ్‌గా మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ ధృవీకరించారు. ఇదేవిధంగా మాజీ ఓపెనర్ మొహిసిన్ హసమ్‌ఖాన్‌ను చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తున్నట్లు ఇజాజ్ భట్ తెలిపారు.

ఇకపోతే.. 2011 ప్రపంచకప్ వరకు పాక్ కోచ్‌గా వకార్ యూనిస్ కొనసాగుతాడని పీసీబీ వర్గాలు తెలిపాయి. కాగా, కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు మొదట తటపటాయించిన వకార్.. కాంట్రాక్టులో కొన్ని మార్పులు చేశాక అందుకు అంగీకరించినట్టు పీసీబీ వర్గాల సమాచారం.

వెబ్దునియా పై చదవండి