ఇంద్రనగర్ లో నివాసం వుంటున్న రామకృష్ణ-భవిత భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమారుడు వున్నాడు. ఐతే భవితకు జ్యోతిష్యం అంటే పూర్తి నమ్మకం. ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన జ్యోతిష్యం ప్రకారం భర్తతో విడిపోతారని చెప్పారు. అదే నిజం అనుకుని నమ్మిన భవిత తన భర్తతో తనతో విడిపోతాడని ఊహించుకుని తట్టుకోలేక ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నది.
ఐతే తమ కుమార్తెది ఆత్మహత్య కాదనీ, అల్లుడే అదనపు కట్నం కోసం తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడంటూ రాముపై దాడి చేసారు. కానీ ఆమె మరణానికి తను కారణం కాదనీ, జ్యోతిషం పిచ్చితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని అతడు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.