పెళ్ళయ్యింది. ముగ్గురు పిల్లలున్నారు. భర్త ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సాఫీగా సాగిపోతున్న కుటుంబం. అయితే ఆమె పక్కదారి పట్టింది. ప్రియుడినే సర్వస్వంగా భావించింది. కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ప్రియుడితో సహజీవనం పెట్టింది. ప్రియుడు గంజాయి అమ్ముతూ రెండు చేతులా డబ్బులు సంపాదించడంతో ఆమె కూడా ఆ ఊబిలోకి దిగింది. తన అందంతో వ్యాపారాన్ని మరింత రెట్టింపు చేసింది.
యువకులకు గంజాయి ఇచ్చేది. ఇలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగింది. వ్యాపారంలో తమకు తిరుగులేదని భావించింది. ప్రియుడు కూడా గంజాయి వ్యాపారంలో ఆరితేరి పోవడంతో డబ్బులే డబ్బులు. అయితే పోలీసులకు అడ్డంగా దొరికాడు ప్రియుడు. దీంతో కటాకటాల పాలయ్యాడు. పోలీసులు సాదిక్‌ను అరెస్టు చేస్తే తన ప్రియురాలు గురించి కూడా చెప్పేశాడు. దీంతో వివాహితను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.