ఎపిలో పెట్రేగిపోతున్నారు చెడ్డీ గ్యాంగ్ దొంగలు. విజయవాడ, తాడేపల్లి వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చిట్టినగర్, గొల్లపూడి, మాచవరంలో చెడ్డీ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది.
అసలు ఈ చెడ్డీ గ్యాంగ్ వల్ల ఇంటికి తాళాలు కూడా వేసి ఎక్కడకూ బయటకు వెళ్ళలేకపోతున్నారు స్థానికులు. నిందితులు పాత నేరస్థులు కాకపోవడంతో పోలీసులు ఈ కేసు సవాల్‌గా మారింది. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పోలీసులు కూడా బృందాలుగా ఏర్పడి చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.