హైదరాబాద్ నగర శివారు పరిధిలోని పెదతూప్ర గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ (32) అనే వ్యక్తి స్తానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొన్ని నెలులుగా అతని కుటుంబ సభ్యులు ప్రవీణ్‌కు తగిన వధువు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, వారు చూసిన అనేక సంబందాలు వివిధ కారణాలతో ఓ కొలిక్కి రాలేదు.
ఇలా కొన్ని నెలలుగా వరుసగా ఎదరవుతున్న పరిణామాలతో ఆ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పైగా, పెళ్లి విషయంలో అడ్డుంకులను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రవీణ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నడు.