ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత భారీ వర్షం కువడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ ఫలితంతో 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లు సాదించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలువగా కేవలం 7 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లను నామమాత్రంగా ఆడనుంది.
సన్ రైజర్స్ విజయానికి 134 పరుగులు అవసరమైన దశలో భారీ వర్షం ప్రారంభమైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మైదానం చిత్తడిగా మారిపోయింది. ఔట్‌ఫీల్డ్‌లో నీరు నిలిచిపోవడంతో ఆటను కొనసాగించడం సాధ్యంకాలేదు. పరిస్థితులు సమీక్షించిన మ్యాచ్ అధికారులు రాత్రి 11.10 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రటించారు.