డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా

గురువారం, 15 డిశెంబరు 2022 (12:38 IST)
హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల సరఫరాకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను స్మగ్లర్లు, పెడ్లర్లు వినియోగించుకుంటున్నారు. చివరకు ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో కూడా మత్తు పదార్థాలను సరఫరా చేయిస్తున్నారు. తాజాగా హైదారాబాద్ నగరంలో జొమాటో డెలివరీబాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న చుంచు సతీష్ చంద్ర అనే వ్యక్తిని తుకారాంగేట్ పోలీసు అరెస్టు చేశారు. 
 
పెడ్లర్ రాహుల్ ఆదేశాలతో అవసరమైన కస్టమర్లకు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఫుడ్ ఐటమ్‌లో కోడ్ భాషను ఉపయోగిస్తు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా సాగుతున్నట్టు తేలింది.
 
జొమాటోలో ఉద్యోగం చేస్తున్న నితీష్ చంద్ర.. మరింత ఆదాయం కోసం పెడ్లర్‌తో కలిసి గంజాయి సరఫరా చేస్తున్నాడు. అతని నుంచి 600 గ్రాముల గంజాయితో పాటు రూ.5 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది కస్టమర్లకు గంజాయిని సరఫరా చేసినట్టు వెల్లడించడంతో ఆ కస్టమర్ల వివరాల కోసం విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు