తన ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో ఓ యువతి హాస్టల్ గదిలో ఉరేసుకుంది. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఓ యువతి (18) టెలీకాలర్‌గా పనిచేస్తూ అమీర్‌పేటలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది.
తన స్వగ్రామంలో యువకుడితో ప్రేమలో పడిన ఆమెను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన ఆ యువతి నగరానికి వచ్చి హాస్టల్‌లో ఉంటోంది. నెల కిందట తన స్వగ్రామానికి వెళ్లి ఇంట్లోని తన సామగ్రిని తీసుకొని వచ్చింది. కుటుంబసభ్యులెవరితోనూ మాట్లాడలేదు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.