తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు చేసిన పెళ్లిని తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం చేసే అక్కను సోదరుడు కడతేర్చాడు. డ్యూటికి వెళుతున్న కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీకొట్టించి ఆపై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయపోలుకు చెందిన నాగమణి అనే మహిళా కానిస్టేబుల్.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు గతంలో వివాహం కాగా, పది నెలల క్రితం విడాకులు తీసుకుంది.