ఈ యాంత్రిక జీవనంలో పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్య చేయకుండా, వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు దులుపుకోకుండా వారికి సేవలు చేయడం, మన భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి పట్ల బాధ్యతయుతంగా ఉండేలా చేయడం, అందరూ తమ తల్లిదండ్రులను పేమానురాగాలతో చూసుకునేలా చేయడం మొదలైనవి ఈ దినోత్సవం ముఖ్యోద్దేశాలు.
ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని 2012లో యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన అమెరికాలో మొదలైంది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారికంగా ఈ దినోత్సవానికి ఆమోద ముద్రవేశారు. దీంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ దినోత్సవాన్ని వేరువేరు తేదిల్లో జరుపుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి భేదం ఉండకూడదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో పేరెంట్స్ డే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
ప్రస్తుతం ఈ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రుల తమ పిల్లల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, వారి పట్ట వహిస్తున్న శ్రద్ధ అభినందనీయం. ఇలాంటి ఆపద సమయంలో కుటుంబం ఆసరా, తల్లిదండ్రుల తమ పిల్లల పట్ల వహించే బాధ్యతలను, తల్లిదండ్రుల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే కాక గుర్తించేలా చేసింది ఈ పారెంట్స్ డే. తల్లిదండ్రుల అందరికీ పారెంట్స్ డే శుభాకాంక్షలు.