యాంకర్‌లు విలువలు దిగజారుస్తున్నారు: దాసరి

టీవీ జర్నలిజం వచ్చాక పాత్రికేయుల విలువలు పడిపోయాయనీ, నేటి యాంకర్‌లకు గతం ఏమిటో కూడా తెలీకుండా న్యూస్‌లు చదివేయడం బాధగా ఉందని డా|| దాసరి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా ఫంక్షన్‌కు యాంకర్‌గా వస్తారు. అతిథుల్నే మీ పేరు ఏమిటి...? మీరు ఏమేమీ చేశారు? అంటూ ఈమధ్య చాలా మంది యాంకర్‌లు అడగడం చూశాను. నాకే సిగ్గుగా ఉంది. అందుకే అటువంటివారు గతం గురించి తెలుసుకోండి. మైకులు పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తే ఎలా? ఇంటర్వూ చేస్తుంటే.. దానికి హోంవర్క్‌ చేయాలి..? ఇవన్నీ మర్చిపోయి... ఏవేవో మాట్లాడి. జర్నలిజం విలువలుదిగజారుస్తున్నారంటూ.. దాసరి అన్నారు.

ఇక రాబోయే తరాలవారు రఘుపతి వెంకయ్య ఎవరు? అని అడిగినా అడుగుతారు. అటువంటివారు గత చరిత్రను చదవాల్సిన అవసరం ఉందని అన్నారు. సీనియర్‌ సినీపాత్రికేయుడు పసుపులేటి రామారావు రచించిన ' నాటి మేటి సినీ ఆణిముత్యాలు' పుస్తకావిష్కరణ గురువారంనాడు డా|| దాసరి నారాయణరావు విడుదల జేయగా తొలిప్రతిని ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడు చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... నిబద్ధత గల జర్నలిస్టుగా పసుపులేటి పేరు సంపాదించారనీ, ఓ ఫంక్షన్‌లో తాను పలుకరించకపోతే అలిగాడనీ, ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసేదాకా శాంతించలేదని గుర్తుచేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి