తమిళ, తెలుగు చిత్ర సీమల్లో సెక్సీతారగా ముద్ర వేసుకున్న హీరోయిన్ నమిత. ఈమెపై తాజాగా నీలి చిత్రాల స్పెషలిస్టు, పెళ్లిళ్ళ పేరయ్యగా ముద్రడిన లియాకత్ ఆలీ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క నమితపైనే కాకుండా.. నగ్మా, మీనాలతో కూడా దగ్గరి సంబంధాలు ఉన్నట్టు ప్రకటించాడు. ఈ వార్తలు విన్న నమిత మాత్రం వెంటనే స్పందించి.. లియాకత్ అలీ చెప్పిందాంట్లో ఎంత మాత్రం నిజంలేదని వాదిస్తోంది.
కింగ్ ఆఫ్ మ్యారేజ్‌గా పేరు గడించిన లియాకత్ అలీ వెల్లడించిన వార్తలు తమిళ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. నగ్మా, మీనా, నమితలతో తనకు దగ్గరి స్నేహం ఉందని, ఈ ముగ్గురిలో నమిత మరింత దగ్గరి స్నేహితురాలని లియాకత్ బాంబు పేల్చాడు.
దీనికి తట్టుకోలేక పోతున్న నమిత తీవ్ర ఆగ్రహంతో తనపై వచ్చిన వార్తలను కొట్టిపడేస్తోంది. ఆయనతో నాకెలాంటి సంబంధాలు లేవని, అవసరమైతే ఆయనపై కోర్టులో దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అయితే.. నటీమణులపై ఆలీ చేసిన ఆరోపణలు నిరూపించాల్సింది పోలీసులే మరి. అప్పటి వరకు ఈ వార్తలు మాత్రం చెన్నై కోడంబాక్కం వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది.