"మిస్సమ్మ"కు పెళ్ళయిపోయింది!

మంగళవారం, 23 అక్టోబరు 2007 (17:36 IST)
ప్రముఖ సినీనటి భూమిక ముంబయికి చెందిన యోగా మాస్టర్ భరత్ ఠాగూర్‌ను విజయదశమి నాడు వివాహం చేసుకుంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ సరసన "యువకుడు" చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ద్వారా భూమిక తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

అనంతరం తమిళ, హిందీ సినిమాల్లో నటించడం ద్వారా తనదైన ప్రతిభను భూమిక చాటుకుంది. ఈ నేపథ్యంలో ఆమె చిరకాల మిత్రుడు, యోగామాస్టర్ భరత్ ఠాగూర్‌, భూమికల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందంటూ...వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సమర్థిస్తూ త్వరలో తామిరువురూ పెళ్ళి చేసుకోబోతున్నామంటూ భూమిక చెపుతూ వచ్చింది. ఆ పెళ్ళిపై ఊహాగానాలను తెరదించుతూ నాసిక్‌లో అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో భూమిక వివాహం గోప్యంగా జరిగింది.

ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ.... ఈ నెల 25వ తేదీన ముంబై నగరంలోని హోటల్‌లో అంగరంగవైభవంగా పెళ్ళి చేసుకోవాలనుకుమన్నామని తెలిపింది. అయితే విజయదశమి రోజు శుభప్రదమని పెద్దలు తెలపడంతో ఆరోజే నాసిక్‌లో పెళ్ళి చేసుకున్నామని వివరించింది. ప్రస్తుతం ఆమె "అనసూయ" అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి