ప్రభుదేవాను పెండ్లి చేసుకుందామని కలలు కంటున్న నయనతార కంట్లో నలుసులా పాతప్రియుడు అడ్డుపడుతున్నాడట. గతంలో నయనతో కలిసి చేసిన షికార్లు, నైట్ పార్టీల గురించి తెగ చెపుతున్నాడట.
ఈ విషయం ఆ నోటా... ఈ నోటా ప్రభుదేవాకు చేరిందట. దీంతో చిర్రెత్తిన ప్రభుదేవా నేరుగా శింబుకు ఫోన్ చేసి... అటువంటి వాగుడు కట్టిపెట్టాలని వార్నింగ్ కూడా ఇచ్చాడట.
పనిలోపనిగా నయనతార వద్దకెళ్లి శింబు చెపుతుంది నిజమేనా...? అంటూ ప్రభుదేవా చిందులేసినట్లు భోగట్టా. అవన్నీ వట్టి అబద్ధాలేననీ, కేవలం సినిమాకోసమే లిప్ టు లిప్ కిస్ ఇచ్చానని కవరప్ చేసే యత్నం చేసిందట నయన. పాత ప్రేమాయణం... అంటే మాటలా...? మహా జిడ్డు. అంత తొందరగా వదులుతుందా ఏంటి మరి..?