జెస్సీ మెట్‌కాఫ్‌ సరసన శివాజీ భామ

బుధవారం, 24 అక్టోబరు 2007 (12:56 IST)
FileFILE
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన అందాల హీరోయిన్ శ్రియ నటించింది ఒక్క చిత్రమే కావచ్చు. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళంలో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకున్న శ్రియ బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం కూడా సాఫీగా సాగింది. అలాగే.. హాలీవుడ్ నటుడు జెస్సీ మెట్‌కాఫ్ సరసన నటించే సువర్ణావకాశం తాజాగా కొట్టేసింది.

అశోక్ అమృతరాజ్ సొంత నిర్మాణ సంస్థ అయిన హైడ్ పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జెస్సీ మెట్‌కాఫ్ హీరోగా నిర్మించనున్న ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో శ్రియ నటించనుంది. వచ్చే వారం ముంబైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. ఈ సమయంలో జెస్సీతో శ్రియ ప్రేమాయణం సాగించవచ్చే అవకాశాలు లేకపోలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి