పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి బిబిసీ రియాలిటి షోలో నాట్యం చేయాలన్న ఆరాటం మొదలయినట్లుంది. బిబిసీ రియాలిటీ షో నిర్వాహకుల భారతదేశానికి సంబంధించిన నాట్యాన్ని చేయమని తనకు ఆహ్వానం వస్తే వదిలిపెట్టనని చెపుతోంది ఈ 32 ఏళ్ల ప్రౌఢ సుందరి.
ఇంతకుముందు లండన్‌లో బిగ్ బ్రదర్ షో నిర్వహించిన షోలో శిల్పాశెట్టి పాల్గొంది. ఆ ప్రదర్శనలో శిల్పాశెట్టిపై కులవివక్షకు సంబంధించిన అంశాలను లేవనెత్తటంతో... దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అయితే చివరికి బ్రిటిష్ ప్రదర్శనలో 63 శాతం ఓట్లను సాధించి కిరీటాన్ని కైవసం చేసుకుంది.
బిగ్ బ్రదర్ అనుభవం దృష్ట్యా మళ్లీ మరోసారి అటువంటి ప్రాజెక్టులను ఒప్పుకునేదే లేదంటోంది. అంతేకాదు నిరంతరం తనపై కెమేరాలను పెట్టి చూపించే ప్రదర్శనలలో తాను పాల్గొనే ప్రశక్తే లేదని చెపుతోంది. ఏదేమైనా 'తిరిగే కాలు... తిట్టే నోరు ఆగదు' అన్నట్లు... నాట్యం చేయగల 'పొడుగు' కాళ్లు ఆగవుకదా....