సంక్రాంతి కానుకగా జనవరి 12న వెంకటేష్ 'బాడీగార్డ్'
మంగళవారం, 1 నవంబరు 2011 (18:15 IST)
WD
విక్టరీ వెంకటేష్ హీరోగా మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రై) లిమిటెడ్ సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బాడీగార్డ్'. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ''ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. డిసెంబర్‌లో ఆడియో రిలీజ్ చేసి జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. థమన్ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. వెంకటేష్ బాబు కెరీర్‌లోనే ఓ విభిన్న చిత్రంగా 'బాడీగార్డ్' రూపొందుతోంది. మా బేనర్‌లో వెంకటేష్‌బాబు చేస్తున్న ఈ రెండో సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.