ఆగస్టు 7న వస్తోన్న పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'
బుధవారం, 24 జులై 2013 (19:42 IST)
WD
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి. పతాకంపై భారీ నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అత్తారింటికి దారేది'. ఈ చిత్రం ఆగస్ట్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''ప్రస్తుతం మా 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించి రీ-రికార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో రిలీజ్ అయిన రోజునుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ విన్నా మా 'అత్తారింటికి దారేది' చిత్రం పాటలే వినిపిస్తున్నాయి.
అలా ఆడియో పరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఆడియోను ఇంత పెద్ద హిట్ చేసిన శ్రోతలకు, ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్‌గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత రిలీజ్ అయిన థియేటర్ ట్రైలర్‌కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు, పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని ఆగస్ట్7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో-ప్రొడ్యూసర్స్: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.