TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

సెల్వి

ఆదివారం, 19 జనవరి 2025 (19:51 IST)
తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కానుకలు కోట్లలో వుంటాయి. తాజాగా చెన్నైకి చెందిన వర్దమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీకి రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి తిరుమలలోని రంగనాయకుల మండపంలో స్వయంగా అందజేశారు. 
 
భారీ విరాళం ఇచ్చిన భక్తుడికి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.రూ.6 కోట్లలో ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కోసం రూ.కోటి విలువైన డీడీలను వర్ధమాన్‌ జైన్‌ అందించారు. గతంలో కూడా వర్ధమాన్‌ జైన్‌ పలుమార్లు భారీ విరాళాలు అందించారు. 
 
టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీలను వర్ధమాన్‌ కుటుంబసభ్యులు అందజేశారు. అంతకుముందు తిరుమల వేంకటేశ్వర స్వామిని దాత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దాత కుటుంబాన్ని ఆలయ అధికారులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు