ప్రభాస్ "బిల్లా" ట్రైలర్‌ను వీక్షించండి

ప్రభాస్, అనుష్క, నమిత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "బిల్లా". అరుంధతి సినిమాతో అందరి మన్ననలను పొందిన అనుష్క బిల్లాలో విలన్ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో నమిత, అనుష్కల ఎక్స్‌పోజింగ్‌ సూపరని మాస్ ప్రేక్షకులు అంటున్నారట. ఈ సినిమాలో కృష్ణం రాజు ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటించారు.

ప్రభాస్ బిల్లా దొంగ-పోలీసు కథ. ఈ తరహా చిత్రాలు చాలానే వచ్చాయి. పాత కథను కొత్తదనంగా తెలియజెప్పేందుకు మెహర్ రమేష్ ప్రయత్నించాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన భలే తమ్ముడు, యుగంధర్, అమితాబ్, షారుఖ్, రజనీకాంత్‌లు చేసిన డాన్ చిత్రాన్ని ఇటీవల తమిళంలో అజిత్ హీరోగా చేశాడు. ఈ "బిల్లా"నే తెలుగులో ప్రభాస్ హీరోగా రీమేక్ అయింది.

మలేషియా స్థావరం ఏర్పరుచుకున్న అంతర్జాతీయ నేరస్థుడు బిల్లా( ప్రభాస్). ఇతడిని పట్టుకోవడానికి ఇంటర్ పోల్ కూడా ప్రయత్నిస్తుంది.

ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌కు చెందిన కృష్ణమూర్తి ( కృష్ణంరాజు) ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా బిల్లాకోసం మలేషియా వస్తాడు. కానీ బిల్లా ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి, బిల్లా రూపంలో ఉన్న వైజాగ్ చెందిన రంగా సహాయంతో డాన్ టీంను పట్టుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నిస్తాడు. ఈ కార్యక్రమంలో రంగా కృష్ణమూర్తికి ఎలా సహాయపడ్డాడు.. అనేదే సినిమా.

ఈ చిత్రంలోని కొన్ని అద్భుత సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

వెబ్దునియా పై చదవండి