తామరాకు పైన నీరు నిలువదు. నీటిలో ఉన్నా తామారాకు తడవదు. నీరు ఆకు పైన తేలుతూ జారిపోతూ ఉంటుంది. ఇది చూచిన ప్రతి ఒక్కరికి ఎందుకు నీరు నిలవదు అన్న అనుమానం వస్తుంది కాదా! 'తామారాకు మీద నీటిబొట్టు' అనే సామెత వింటూ ఉంటాం కదా! తామారాకుల్లోని కణాలలో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది.
అది కొన్ని మార్పులు చెంది క్యూటికిల్ అనే పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరను నున్నగా ఉండే ఆమ్లాలు, ఆల్కహాల్, కార్బన్ వంటి అణువులు ఉంటాయి. అవి నీటితో ఎలాంటి చర్యనూ జరపవు.
అందుకే తామరాకు నీటిలో తడవదు. క్యూటికిల్ పొర ఉన్న ఆకుపై పడే నీరు తలతన్యత కారణంగా గుండ్రటి బిందువులుగా మారుతుంది. బిందువులు నున్నగా జారిపోతాయి. అందుకే తామరాకు నీటిలో తడవదు, ఆకుపై పడిన నీరు నిలవదు.