నీటిలో ఉన్నా.. తామరాకు తడవదేం..?

పిల్లలూ..! పెద్ద పెద్ద రేకులతో, పింక్ కలర్‌లో చూడగానే ఇట్టే ఆకర్షించే తామరపువ్వుల గురించి మీకు తెలిసే ఉంటుంది. మరి ఆ తామర పువ్వుల ఆకులు నీటిలో ఉన్నప్పటికీ తడవకుండా, ఎప్పుడూ పొడిగా ఉంటాయి. ఎందుకో తెలుసా..?!

తామరాకుల బాహ్య పొరలపైన ఉండే కణసముదాయం వల్లనే వాటికి నీరు అంటదు. ఈ ఆకుల్లో ఉండే కణాలలో సెల్యులోజ్ అనే పదార్థం, క్యూటిన్‌గా మార్పు చెంది... ఆకు పై పొరల్లో ఉండే కణాల గోడలపై క్యూటికల్ అనే పొరను ఏర్పరుస్తుంది. ఇది కొవ్వు పదార్థంతో కూడుకున్న మైనంలాంటి పొర.

ఈ పొరలో నునుపైన ఆమ్లాలతోపాటు ఆల్కహాల్, కార్బన్ లాంటి పరమాణువులు ఉంటాయి. ఇవి నీటిలో కరగవు సరికదా.. ఎలాంటి రసాయనిక చర్యలనూ జరపలేవు. కాబట్టి... తామరాకు ఉపరితలానికి రక్షణ కవచంలాగా ఉండే క్యూటికల్ పొరపై పడే నీరు తలతన్యత వల్ల గుండ్రటి బిందువులుగా మారి ఆకుమీద నుంచి జారిపోతాయి. అందుకనే తామరాకులు నీటిలో ఉన్నా కూడా ఎప్పుడూ పొడిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి