స్టెతస్కోప్‌ కథా, కమామీషు..!!

శుక్రవారం, 24 అక్టోబరు 2008 (16:39 IST)
FileFILE
పిల్లలూ... జ్వరం వచ్చినప్పుడు అమ్మా, నాన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు, డాక్టర్ ఓ పరికరాన్ని రెండు చెవుల్లోనూ పెట్టుకుని, కుడిచెత్తో దాని కొసను పట్టుకుని మన గుండెలమీద పెట్టి పరీక్షిస్తాడు కదా...! దీన్నే స్టెతస్కోప్ అంటారు.

పాతకాలపు స్టెతస్కోప్‌ను 1816వ సంవత్సరంలో రేనే థేయోల్ఫే లియేన్నెక్ అనే ఫ్రెంచి వైద్యుడు రూపొందించాడు. ఊపిరితిత్తులోని వాయు ప్రసారానికి సంబంధించిన ధ్వనులను వినేందుకు మొదట చెక్కతో నిర్మితమైన సిలిండర్‌ను ఇతను తయారు చేశాడు.

తరువాత... ఇప్పుడు మనం వాడుతుండే ఆధునిక కాలపు స్టెతస్కోప్ 19వ శతాబ్దంలో అభివృద్ధి చేయబడింది. దీన్ని ఛాతీకి అభిముఖంగా ఉంచేలా, వృత్తాకారానికి అనుసంధానమై, చెవులకు అమరే విధంగా రూపొందించారు. ఇది సాగే గుణం కలిగిన గొట్టాలను కూడా కలిగి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి