తులసి రసంతో దగ్గు, ఆయాసం దూరం చేసుకోండి...!

FILE
శ్వేత తులసి, కృష్ట తులసి ఈ రెండింటిని భారతీయ సంప్రదాయంలో దైవత్వం కలిగించి అనునిత్యం పూజిస్తుంటారు. తులసివనం వాతావరణ కాలుష్యాన్ని హరిస్తుంది. దీని ఆకుల రసం తేనెలో కలిపి సేవిస్తే కఫం తగ్గుతుంది. దగ్గులకు, ఆయాసానికి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు పావుచెంచా, పెద్దలకు ఒకటినుండి రెండు చెంచాలు మోతాదు సరిపోతుంది.

ఎన్నో మందులకు లొంగని ఇస్నోఫీలియాని ఇది తగ్గిస్తుంది. దీనివల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడికి ఇది చాలా మంచి మందు, జలుపు నివారణకు, చికిత్సకు కూడా ఉపకరిస్తుంది.

తులసి, మిరియాలు, శొంఠి కలిపి తయారు చేసిన కషాయం తాగితే జ్వరం, తుమ్ములు, మొటిమలు, తలలోని చుండ్రు, తాజాగా తగిలిన గాయాలు, చర్మంపై కలిగే చిన్న చిన్న మచ్చలు తగ్గిపోతాయి. తులసి రసంలో లవంగాలు కలిపి నూరిన ముద్దను పిప్పి పన్నుపై ఉంచితే నొప్పి తగ్గుతుంది. ఇన్‌ఫెక్షన్ కూడా పోతుంది.

వెబ్దునియా పై చదవండి