లైంగిక శక్తిపై సెక్స్ పుస్తకాల ప్రభావం ఉంటుందా?

గురువారం, 4 ఏప్రియల్ 2013 (17:27 IST)
File
FILE
చాలా మంది పురుషులు సెక్స్‌కు ఉపక్రమించే ముందుగా సెక్స్ పుస్తకాలను చదువుతుంటారు. ఈ అలవాటు స్త్రీలలో కూడా ఉంటుంది. పెళ్లయిన కొత్త దంపతులు సెక్స్‌పై పెద్దగా అవగాహన లేని జంటలు ఈ సెక్స్ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారు. నిజానికి లైంగిక శక్తిపై సెక్స్ పుస్తకాల ప్రభావం ఉంటుందా అనే అంశాన్ని పరిశీలిద్ధాం.

సెక్స్ సాహిత్యం, పోర్నోగ్రఫీ అనేది రెండు అంచుల కత్తితో సమానంగా చెప్పుకోవచ్చు. వీటివల్ల ఉపయోగాలు ఉంటాయా లేవా అనేది వారివారి మనస్తత్వ ఆలోచనలను బట్టి ఉంటాయని చెప్పొచ్చు.

అయితే, కొంతమంది పురుషులు మాత్రం.. సెక్స్ పుస్తకాలు చదవడం వల్ల తమలో మరింతగా కామవాంఛను ప్రేరేపించి రతి క్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తాయని భావిస్తుంటారు. నిజానికి సెక్స్ సాహిత్యం వల్ల లైంగిక విజ్ఞానం పెరిగి సెక్స్ సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఇదే పనిగాసెక్స్ పుస్తకాలను చదవడం వల్ల, సెక్స్ సినిమాలు, బ్లూఫిల్మ్స్‌లు చూడటం వల్ల లైంగిక పటుత్వంతో పాటు కామశక్తి సన్నగిల్లిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి