డిఫ్తీరియా ఒకరి నుంచి మరొకరికి చాలా సులువుగా సోకుతుంది. డిఫ్తీరియా బ్యాసిలస్ అనే క్రిములు ఈ వ్యాధికి రకరకాలుగా పని చేస్తున్నాయి. ఈ క్రిములు ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి సులువుగా చేరిపోయి వ్యాధిని వ్యాపింపజేస్తాయి. వ్యాధి సోకినప్పుడు 100 డిగ్రీల వరకు జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇందుకు ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది.
డిఫ్తీరియా నాలుగు రకాలుగా బయటపడుతుంది. గొంతు, అంగిలికి సోకేది ఒక రకమైతే, స్వరపేటికకు సంబంధించినది మరోరకం అవుతుంది. ముక్కులకు సంబంధించింది ఇంకొక రకం. దవడులు, చిగుళ్ళు, నాలుక, పెదిమలు కంటి రెప్పలకు వచ్చే అవకాశం ఉంది. ఈ లక్షణాలు వేర్వేరుగానే ఉంటాయి. నోటిలో తెల్లటి పొర ఏర్పడుతుంది.
నోరంతా ఎర్రగా పుండవుతుంది. కొండ నాలుక ఏర్పడుతుంది. నోటి దుర్వాసన ఉంటుంది. మూత్రం నందు అల్బూమిన్ పోవుట, వాంతులు ఉండవచ్చు. కంఠ నరాలకు, స్వరపేటిక నాళాలకు పక్షవాతం రావచ్చు. హృదయము బలహీనమవుతుంది. ఇవి ఈ వ్యాధి లక్షణాలు.
చికిత్సా విధానం నశ్యకర్మ, గుండూషము, ప్రాంతీయ బాహ్య స్వేదన చేయవలెను. శస్త్రం ద్వారా పొర తీసివేసి దంతి, వాయు విడంగములు, విష్ణుకాంత, వీనిని చూర్ణించి నాలుకకు రాయవలెను. నువ్వుల నూనెచే నశ్యకర్మ చేయవలెను.
హృదయోత్తేజం కలుగుటకు, క్రిని దుష్టత తొలగడానికి నూతికాభరణ రసము, కస్తూరి కలిపి 50 మి. గ్రా. తేనెతో వేయాలి. ఒక్కోసారి శ్వాస కష్టమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో శ్వాసనాళాలకు శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది.
ఈ ఆహారం తీసుకోవాలి పాలు, పాలువిరిచిన నీళ్ళు, గ్లూకోజు, దానిమ్మ రసం, ద్రాక్ష రసం ఆహారంగా ఇవ్వవచ్చు.
నియమాలు విశ్రాంతి అత్యంత ముఖ్యమైనది. మలమూత్ర విసర్జన కూడా మంచం వద్దనే జరిగే విధంగా చూడాలి. హృదయం బలహీనపడుతుంది కాబట్టి ఇలాంటి విశ్రాంతి అవసరం ఉంటుంది.