ఆస్తమా రోగులు తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లికూతలు, దగ్గుతో బాధపడుతుంటారు. దీనివల్ల సాధారణ జీవనం సాగించడం కూడా వారికి కష్టంగా మారుతుంటుంది. ఉబ్బసం సమస్యను పూర్తిగా నయం చేయలేనప్పటికీ, యోగాసనాల అలవాటు ఖచ్చితంగా దాని లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దినచర్యలో యోగాను చేర్చుకోవడం అనేది ఉబ్బసంతో సహా ఇతర శ్వాసకోశ రుగ్మతల లక్షణాలను తగ్గించడానికి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సమర్థవంతమైన మార్గం.
సేతుబంధాసనతో ఊపిరితిత్తుల సమస్యకు చెక్
ఊపిరితిత్తుల సమస్యను తగ్గించేందుకు సేతుబంధాసన యోగా చాలా ప్రభావవంతమైనది. బ్రిడ్జ్ భంగిమ అభ్యాసం నుండి వీజింగ్ వంటి శ్వాస సమస్యల నుంచి బయటపడవచ్చు. ఊపిరితిత్తులను తెరవడానికి, ఇరుకైన వాయుమార్గాలను తిరిగి మామూలు స్థితికి చేరేట్లు చేయడానికి ప్రత్యేకంగా ప్రయోజనకరమైనది. సేతుబంధాసన యోగాను క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, శ్వాస సమస్యలను తగ్గించడంలో ప్రయోజనం చేకూరుతుంది.
గమనిక: సేతుబంధాసనంను కడుపులో అల్సర్లు వున్నవారు, హెర్నియాతో బాధపడేవారు, గర్భిణీలు వేయరాదు. ఆసనాలు వేసే ముందు యోగా నిపుణులను సంప్రదించాలి.