కళ్లు తిరిగి పడిపోవడానికి కారణాలేంటో తెలుసా?

సోమవారం, 11 ఏప్రియల్ 2016 (10:11 IST)
చాలామంది ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోతారు. మంచం మీద పడుకున్నా, లేచినా, ఎవరైన పిలిస్తే అటువైపు తిరిగినా కళ్లు తిరుగుతున్నాయని అంటుంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. అసలు సమస్య ఏంటో తెల్సుకుందాం!
 
సాధారణంగా ఈ తరహా సమస్య వయస్సుతో సంబంధం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే, కళ్లు తిరగడానికి చాలా కారణాలుంటాయని వైద్యులు చెపుతున్నారు. 
 
మెదడులో రక్తనాళాలు కుంచించుకుపోవడం ప్రధాన కారణంగా చెపుతారు. రక్తంలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి. ఇవి సమతుల్యతను నియంత్రించే రక్తనాళాల్లో ఏర్పడితే కళ్లు తిరుగుతాయి. 
 
మరో కారణం పొజిషనల్‌ వెర్టిగో. మనం కొన్ని భంగిమల్లో ఉన్నప్పుడు మనం తిరగకుండానే తిరిగినట్లు సంకేతాలు మెదడులోని సమతుల్యతను నియంత్రించే కేంద్రానికి వెళ్తాయి. దీనివల్ల మనకు కళ్లు తిరుగుతున్నట్లు భ్రమ కలుగుతుంది. 
 
ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కాలంటే పడుకునేటప్పుడు ఫ్లాట్‌గా కాకుండా, తలవైపు పరుపును 30 డిగ్రీల కోణంలో ఉంచుకోవాలి. ఎటువైపు తిరిగి లేస్తే కళ్లు తిరుగుతాయో, అటువైపు కాకుండా మరోవైపు తిరిగి లేవాలి. మరీ సమస్యగా ఉంటే ఈఎన్‌టి డాక్టర్‌ను సంప్రదించి తగిన విధంగా వైద్యం చేసుకుంటే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి