హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

దేవీ

శనివారం, 17 మే 2025 (14:07 IST)
Prashanth Neel, NTR
ఎన్.టి.ఆర్. సినిమా అప్ డేట్ ప్రశాంత్ నీల్ సినిమా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ లో ఎన్.టి.ఆర్. పాల్గొన్నారు. ముందుగా ఎన్.టి.ఆర్. పుట్టినరోజునాడు నీల్ ఈ కొత్త సినిమా డ్రాగన్ (వర్కింగ్ టైటిల్), షూటింగ్ విషయాలు చెప్పాలని ప్లాన్ చేశారు. కానీ షడెన్ గా వార్ 2 సినిమా గురించి కొత్త అప్ డేట్ ప్రకటిస్తున్నట్లు నిన్ననే హ్రుతిక్ రోషన్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో నీల్ వెనకడుగువేశారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
 
ఎన్.టి.ఆర్. బృందం మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ సినిమా తక్షణ విడుదల #War2 ను అతని పుట్టినరోజున అందరి దృష్టిని ఆకర్షించడానికి మార్గం సుగమం చేస్తోంది. ఇది తెలుసుకున్న  NTRNeel మొదట ఆ రోజు కోసం ప్లాన్ చేసిన గ్లింప్స్ తరువాత తేదీకి మార్చబడింది.
 
ఎన్టీఆర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ యాక్షన్ పాక్డ్ మూవీగా రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల 19వ తేదీన వార్ 2 అప్ డేట్ వస్తుంది. ఆ తర్వాత రోజు డ్రాగన్ సినిమా అప్ డేట్ వస్తుంది. ఏది ఏమైనా రెండు రోజులపాటు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ లో వుంటాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు