ఈ సందర్భంగా సమంత ఆసక్తికరంగా మాట్లాడారు. అంతకంటే క్లారిటీగా నటి మధుమణి కూడా మాట్లాడింది. ఏవరేమన్నారో చూద్దాం. సమంత మాట్లాడుతూ, పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. శుభం మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరితో నవ్వులు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన సక్సెస్. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు.
మా ట్రాలాలా లక్ష్యం కోసం ఎంతైనా కష్టపడుతూనే ఉంటాం. రాజ్ అండ్ హిమాంగ్‌లే ట్రాలాలా బ్యాక్ బోన్‌లా నిలుచున్నారు. ప్రవీణ్ చాలా మంచి వ్యక్తి. ఆయనెప్పుడూ ట్రాలాలాలో ఓ భాగం. వసంత్ ఎప్పుడూ మా బ్యానర్‌లో భాగస్వామి. శుభం సినిమాను ముందుకు తీసుకెళ్తున్న అభిమానులకు థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని అన్నారు.
ఇక మధుమణి మాట్లాడుతూ, సమంతకు తల్లిగా రంగస్థలంలో నటించాల్సింది. కానీ ఎందుకనే తర్వాత పిలవలేదు. కానీ సమంతతో మిస్ అయ్యాయని ఫీల్ గమనించిన సమంత నన్ను శుభంలో తీసుకుంది. కానీ ఫస్డ్ డే నాడు చికెన్ ఫ్యాక్స్ వచ్చాయి. దాంతో షూటింగ్ కు నాలుగు నెలలు వెళ్లలేదు. ఇంక అవకాశం రాదు అనుకున్నా. కానీ నన్ను పిలిచి చేయించారు. పాత్రకు మంచి పేరు దక్కింది.
అదేవిధంగా రాజ్, సమంత కలిసి నిర్మాతలుగా ప్రయాణాన్ని సాగించారు. ఈ ప్రయాణాన్ని ఆపకుండా ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నారు. శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు. ఈ మాటలో వారిద్దరి రిలేషన్ పై ముద్ర నిజమనే తేలింది. త్వరలో ఒక్కటి కాబోతున్నారంటూ ఆమె ఫ్యాన్స్ కూడా ఆనందంగా వున్నారు.